న్యాయమూర్తి జి.భానుమతి...
నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు...
పాల్వంచ (విజయక్రాంతి): నేతాజీ యువజన సంఘం సేవలు అభినందనీయమని న్యాయమూర్తి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరీ జి భానుమతి అన్నారు. గురువారం నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు ఎస్.జె.కె. అహ్మద్ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ.. న్యాయమూర్తి జి.భానుమతి హాజరై పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు, ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ముందుగా నేతాజీ యువజన సంఘం నాయకులతో కలిసి ఆమె సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి ప్రసంగించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జి.భానుమతి మాట్లాడుతూ నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ప్రతి ఏటా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రోగులకు పాలు పండ్లు రొట్టెల పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. నేతాజీ యువజన సంఘం తమ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.జె.కె. అహ్మద్, పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ సోమరాజు దొర, ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ రాంప్రసాద్, డాక్టర్ నామ బుచ్చయ్య, పాల్వంచ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల కొండలరావు, నేతాజీ యువజన సంఘం లీగల్ అడ్వైజర్ మెండు రాజమల్లు, నేతాజీ యువజన సంఘం సభ్యులు సయ్యద్ అక్బర్, ఏవి రాఘవ, ఎండి అబ్దుల్ రజాక్, జె. స్టాలిన్, ఎండి రావూఫ్, జారే బిక్షం, ఓం ప్రకాష్, ముగిది శ్రీరామ్, మీసాల సత్యం, ఎండి ఆసిఫ్, జె.రమణ.సద్దాం, రామినాయుడు, వివిధ సంఘాల నాయకులు సయ్యద్ రషీద్, ఎండి మంజూర్, బండి ఎల్లారావు, డోలి శ్రీనివాస్, శనగ రామచంద్రరావు, ఎండి మస్తాన్ ఖురేషి, ఉబ్బెన శ్రీను, ఎండి యూసుఫ్, తదితరులు పాల్గొన్నారు.