కరీంనగర్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ గోల్డెన్ శాతవాహను సందర్శించిన రీజినల్ చైర్ పర్సన్ గాలిపల్లి వెంకట్ వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ అవసరం ఉన్న ప్రజలకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని లయన్స్ క్లబ్ ముఖ్య ఆశయాలైన పర్యావరణ పరిరక్షణ ఆకలిని నివారించుట నేత్రదానం క్యాన్సర్ నివారణ తదితర కార్యక్రమాలు కొనసాగిస్తుందని.
ఈ లయన్స్ క్లబ్ 220 దేశాల్లో తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందని తెలియజేశారు లయన్స్ క్లబ్ గోల్డెన్ శాతవాహనఅనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందని అభినందించారు ఈ సందర్భంగా గాలిపల్లి వేంకట్ ను రీజియన్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు మానవాడ శంకర్ సన్మానించారు ఈ కార్యక్రమంలో సెక్రెటరీ ననువాల గిరిధర్ రావు సెకండ్ వైస్ ప్రెసిడెంట్ చిలుపూరీ రాములు డైరెక్టర్ మాన్వాడ వనజ సభ్యులు గోన చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.