calender_icon.png 4 March, 2025 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ సరఫరాలో లైన్‌మెన్‌ల సేవలు కీలకమైనవి

04-03-2025 06:29:16 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా వినియోగదారులకు అందించే విద్యుత్ సరఫరాలో లైన్మెన్ ల సేవలు ఎంతో కీలకమైనవి అని ఎల్లారెడ్డి మండల విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ విజయ సారధి అన్నారు. మంగళవారం నాడు లైన్ మెన్ ల దినోత్సవం పురస్కరించుకొని ఎల్లారెడ్డి మండల లైన్మెన్ లతో సమావేశమై వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... విద్యుత్ సరఫరా లో లైన్మెన్ల సేవలు ఎంతో కీలకమైనవని అత్యవసర సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినప్పుడు రాత్రి పగలు, ఎండ వాన అనే తేడా లేకుండా సాహసంతో విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. వారి సేవలను అభినందించారు. లైన్మెన్ ల సేవలు సాహసంతో కూడినవి అయినప్పటికీ తగిన భద్రత నియమాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల విద్యుత్ శాఖ ఏఈ వెంకటస్వామి, పలువురు లైన్మెన్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.