calender_icon.png 21 April, 2025 | 1:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ సేవాశ్రమం సేవలు అభినందనీయం

11-12-2024 12:54:18 AM

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

ముషీరాబాద్, డిసెంబర్ 10 : నిరుపేదలను ఆదకునేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకురావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మంగళవారం లోయర్ ట్యాంక్‌బండ్‌లోని భారత్ సేవాశ్రమంలో మున్సిపల్ వర్కర్స్, నిరుపేదలకు దుప్పట్లు, చీరలు, వస్త్రాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. మొదట ఆశ్రమంలో ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారత్ సేవాశ్రమం నగర అధ్యక్షుడు మునిశ్వరానంద, కార్యదర్శి వెంకటేశ్వరానంద సంయుక్త ఆధ్వర్యంలో దాదాపు వెయ్యిమంది నిరుపేదలు, మున్సిపల్ కార్మికులకు దుప్పట్లు, చీరలు, వస్త్రాలను పంపిణీ చేశారు.

భారత్ సేవాశ్రమం సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో భారత్ సేవాశ్రమం నగర అధ్యక్ష, కార్యదర్శులు.. స్వామి మునీశ్వరానంద, స్వామి వెంకటేశ్వరానంద, వందలాది మంది మున్సిపల్ కార్మికులు, నిరుపేదలు పాల్గొన్నారు.