calender_icon.png 2 April, 2025 | 1:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవాసమితి సేవలు అభినందనీయం

01-04-2025 12:47:14 AM

- ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

పటాన్ చెరు, మార్చి 31 : సమాజ సేవలో శ్రీ భగవాన్ సత్యసాయి బాబా సేవాసమితి సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. వేసవికాలం సందర్భంగా ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు పటాన్ చెరు పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ఏర్పాటుచేసిన శ్రీ భగవాన్ సత్యసాయిబాబా చలివేంద్రాన్ని సోమవారం ఉదయం ఎమ్మెల్యే  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవికాలంలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చడం స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం సత్యసాయి బాబా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.