calender_icon.png 17 November, 2024 | 1:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వీస్ బాగాలేదని.. ఓలా షోరూంకు నిప్పు

12-09-2024 02:39:53 AM

బెంగళూరు, సెప్టెంబర్ 11: ప్రస్తుతం ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తున్నది. కానీ, వాహనం కొన్న తర్వాత నిత్యం ఏదో ఒక సమస్య వస్తుండటంతో వినియోగదారులు షోరూంల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. దేశంలోనే నంబర్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఓలాపై లెక్క లేనన్ని ఫిర్యాదులున్నాయి. తాజాగా ఓలా సర్వీస్ తీరుకు విసుగుచెందిన ఓ కస్టమర్ ఏకంగా ఆ కంపెనీ షోరూంనే తగులబెట్టాడు.

ఈ ఘటన కర్ణాటకలోని కలబురగిలో చోటుచేసుకొన్నది.  మహ్మద్ నదీమ్ అనే వ్యక్తి ఇటీలవ ఓలా స్కూటర్ కొనుగోలు చేశాడు. అంతలోనే అందులో సమస్యలు రావటంతో షోరూంకు ఎన్నిసార్లు వెళ్లి అడిగినా సరైన సమాధానం రాలేదు. దీంతో విసుగు చెందిన నదీమ్ మంగళవారం పెట్రోల్ తీసుకెళ్లి షోరూంలో చల్లి నిప్పంటించాడు. అతడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.