01-04-2025 11:41:10 PM
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లా ఉమ్మడి పాలమూరులోనే మహిళల పట్ల తరచూ అఘాయిత్యాలు జరగడం అత్యంత శోచనీయమని బిఎస్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్న, జిల్లా ఇంచార్జీ పృధ్వీరాజ్, కల్వకుర్తి అసెంబ్లీ అధ్యక్షులు బాలు మండిపడ్డారు. మంగళవారం ఊరుకొండ పేట అంజన్న ఆలయ పరిసరాల్లోని సంఘటన స్థలిని వారు పరిశీలించారు.
అత్యంత పాషవికంగా వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన మానవ మృగాలను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. తరచూ అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే ఆలయ పరిసరాల్లో మరుగుదొడ్లు మూత్రశాలలో వంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం దారుణమని కనీసం పోలీసు భద్రత ఏర్పాట్లు కూడా కల్పించకపోవడం దురదృష్టకరమన్నారు. సీఎం సొంత జిల్లాలోనే మహిళలకు రక్షణ లేకపోవడం దారుణమన్నారు.