సౌతాఫ్రికాతో మూడో టీ20
ట్రినిడాడ్: సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ను వెస్టిండీస్ క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం ట్రినిడాడ్ వేదికగా జరిగిన మూడో టీ20లో విండీస్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో సౌతాఫ్రికాపై 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 13 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. స్టబ్స్ (15 బంతుల్లో 40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అనంతరం లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 9.2 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 116 పరుగులు చేసింది. షెయ్ హోప్ (42 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు), పూరన్ (35; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), హెట్‌మైర్ (31 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులతో అలరించారు. షెపర్డ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, హోప్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గెలుచుకున్నారు. అంతకముందు జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను మాత్రం సౌతాఫ్రికా 1 నెగ్గిన సంగతి తెలిసిందే.