09-02-2025 01:32:03 AM
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
ముషీరాబాద్, ఫిబ్రవరి 8: మాంగ్‌ల మనోభావాలు విస్మరించారని, మాంగ్‌లు మాదిగలతోనే కలిసి ఉండాలని కోరుకుంటున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్య పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. నేతకానీలను ప్రత్యేక కేటగిరిగా పరిగణించాలని ప్రభుత్వాన్ని కోరారు. శని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మాంగ్ కులస్తులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమందకృష్ణ మాదిగ, మాజీ ఎం వెంకటేశ్ మాట్లాడారు.
మాంగ్‌ల భాష వేరైనా వృత్తి ఒక్కటేనని అన్నారు. మాంగ్‌ల మనోభావాలు గౌరవించలేదని, మాల నాయకులు కట్ర చేసి జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను వారికి అనుగుణంగా మార్చు యుథ్నూ ఆరోపించారు. గతంలో ‘బి’ గ్రూప్‌లో ఉన్న మాంగ్‌లను ‘ఎ’ గ్రూప్‌లో కలపడంతో వారి మనోభావాలను దెబ్బతీశారన్నారు.
15 లక్షల జనాభా ఉన్న మాలలకు 5 శాతం కేటాయిస్తే, 32 లక్షల జనాభా ఉన్న మాదిగలకు 9 శాతం ఇవ్వడం సమంజసమేనా అని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 10న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులను, చీఫ్ సెక్రెటరీ శాంతకుమారిలను కలిసి మాంగుల, నేతకానీల అభిప్రాయాలను వారి దృష్టికి తీసు నని మంద కృష్ణ తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లు తప్పుల తడకగా ఉన్నదని, కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేసిందని వెంకటేశ్ ఆరోపించారు. ఈ సమావేశంలో మాంగుల అధ్యక్షుడు బాలాజీ, సీనియర్ పాత్రికేయుడు ఇస్మాయిల్, నేతలు నర్సింహా పాల్గొన్నారు.