calender_icon.png 25 April, 2025 | 2:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి

25-04-2025 12:47:05 AM

సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి

 కొండపాక, ఏప్రిల్ 24: రాజీవ్ యువవికాసం లబ్ధిదారుల ఎంపికను ప్రారంభించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులు, బ్యాంకు అధికారులను సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రభుత్వం ఎస్సి, ఎస్టీ, బిసి, మైనార్టీ శాఖల ద్వారా స్వయం ఉపాధికి అవకాశం కల్పించిందన్నారు. రుణం కోసం 60వేల మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.

మండల స్థాయిలో శుక్రవారం ఎంపీడీవోలు, బ్యాంకు అధికారుల సమావేశం నిర్వహించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలు బ్యాంకులవారీగా దరఖాస్తుల స్క్రూటీని నిర్వహించాలన్నారు. ఎస్బిఐ, తెలంగాణ గ్రామీణ బ్యాంకు, యూనియన్ బ్యాంకులలో ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని, ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, సంబంధిత శాఖల అధికారులు బ్యాంక్ అధికారులతో కలిసి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి మే 21వ తేదీలోగా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ హరిబాబు, డిఆర్డీఓ జయదేవ్ ఆర్య తదితరులు పాల్గొన్నారు.