calender_icon.png 29 April, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలి

29-04-2025 12:45:07 AM

తిమ్మాపూర్, ఏప్రిల్ 28: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలసత్పత్తి సర్వే చేస్తున్న అధికారులను ఆదేశించారు. మానకొండూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం పరిశీలించారు.

అర్జీదారు దరఖాస్తును, ఫీల్డ్ సిబ్బంది వెరిఫికేషన్ ఫారాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు ఉండడానికి వీలులేదని, వచ్చిన దరఖాస్తులలో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తహసిల్దార్ రాజేశ్వరి, ఎం.పి.డిఓ, పంచాయతీ కార్యదర్శి రేవంత్, ఉన్నారు.