calender_icon.png 29 December, 2024 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెకండ్ లేడీ తెలుగు అమ్మాయే

07-11-2024 02:06:24 AM

ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ సతీమణి ఉషా ఏపీకి చెందినవారు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయం సాధించగా అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షునిగా ఆంధ్రా అల్లుడే కాబోతున్నారు. తెలుగు మూలాలున్న ఉషా చిలు కూరి భర్త జేడీ వాన్స్ ఎన్నిక కానున్నారు. దీంతో ఉషా పేరు ఏపీలో మార్మోగిపోతోంది. ఉషా చిలుకూరి.. కుటుంబం అమెరి కాలో స్థిరపడింది.

ఆమె పూర్వీకులు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామానికి చెందినవారు. ఉషా తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి దంపతులు 1986 లో అమెరికాకు వలస వెళ్లారు. కాలిఫోర్నియాలోని శాన్‌డియాగోలో ఇంజినీరింగ్, మాలిక్యులర్ బయాలజీ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. ఉషా కూడా శాన్‌డియాగోలోనే పుట్టి పెరిగారు.

యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందాక కేంబ్రిడ్జిలో పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. న్యాయ విభాగంలో సుదీర్ఘంగా పనిచేశారు. యేల్ లా స్కూల్‌లోనే తొలిసారి వాన్స్‌ను కలుసుకున్నారు. 2014లో కెంటకీలో హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. భర్త విజయంలో ఉష కీలక పాత్ర పోషించారు.   

వాన్స్, ఉషపై ట్రంప్ ప్రశంసలు..

ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ గొప్ప ఎంపిక అని అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఎన్నికల తర్వాత ఫ్లోరిడాలో తొలిసారి మాట్లాడిన ట్రంప్.. వాన్స్, ఉషకు అభినందనలు. ఉష ఎంతో మంచి వ్యక్తి. వాన్స్ ఈ యుద్ధంలో ఎంతో గొప్పగా పోరాడారు. ప్రత్యర్థుల శిబిరాల్లోకి వెళ్లి మరీ పనిచేశారు అని పొగడ్తలతో ముంచెత్తారు.