22-12-2024 01:24:23 AM
రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పరిస్థితి అడకత్తెరలో పోకముక్కలా తయారైంది. శాసన సభ, మం డలి సమావేశాల్లో తాము చేరిన అధికార కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వలేక, బీఆర్‌ఎస్ పార్టీకి అండగా ఉండలేక బిక్కమొకం వేశారు. ప్రభుత్వం పెట్టిన బిల్లులకు మద్దతు ఇవ్వలేక, ప్రభుత్వ తీరును వ్యతిరేకించిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు వెంట నిలవకుండా సభలో మౌనంగా కూర్చునే పరిస్థితిలో కొట్టుమిట్టడారు.
ప్రతిపక్ష సభ్యులు పోడియం వైపు దూసుకెళ్లితే, అధికార పక్షపార్టీ సభ్యులు వారిని కౌంటర్ చేస్తుంటే కండువాలు మారి సభ్యులు నోరు మెదపని దుస్థితి నెలకొంది. ఎమ్మెల్సీలుగా ఉన్న లాభం ఏమిటి? ఎక్కడ మద్దతు ఇవ్వకుండా చేతులు ముడుచుకుంటున్నారని బీఆర్‌ఎస్ సభ్యులు వీరిని ఎద్దేవా చేయడం గమనార్హం. ప్రతిపక్ష సభ్యుల వైపు వెళ్లకుండా, అధికార పక్షం సభ్యుల దగ్గరకు పోకుండా దూరంగా కూర్చోవడమే వారివంతైంది.
డీ నాగరాజు