calender_icon.png 3 April, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘శాస్త్ర వేత్తగా ఒక రోజు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

25-03-2025 12:42:52 AM

జగిత్యాల అర్బన్, మార్చి 24 (విజయక్రాంతి): జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలలో ‘శాస్త్రవేత్తగా ఒక రోజు‘ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనిని విజయవంతం చేయాలని జిల్లా విద్యాధికారి రాము తెలిపారు.విద్యార్థులను బాల శాస్త్రవేత్తలుగా ప్రోత్స హించేందుకు విద్యాశాఖ వివిధ పథ కాలను, కార్యక్రమాలను అమలు చేస్తోందని, కేంద్ర పాఠశాల విద్యా శాఖ ఆదేశాల మేరకు ’ఒకరోజు శాస్త్రవేత్తగా’... అనే వినూత్న కార్యక్ర మాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర విద్య, పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) తాజాగా ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమాన్ని అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలల్లో నిర్వహించాలని  సూచించారు