calender_icon.png 19 January, 2025 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒలింపిక్ ముచ్చట్లు భయపెడుతున్న ‘సీన్’

29-07-2024 12:05:00 AM

పారిస్: అందరూ భయపడ్డట్లే జరిగింది. సీన్ నది కాలుష్యం వల్ల పారిస్ ఒలింపిక్స్ స్విమ్మింగ్ ట్రయథ్లాన్ తొలి ట్రైనింగ్ సెషన్ రద్దయింది. నీటి నాణ్యతకు సంబంధించి సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాం.. ట్రయథ్లాన్ సన్నద్ధతను రద్దు చేశాం. అథ్లెట్ల ఆరోగ్యమే మాకు ముఖ్యం అని ఒలింపిక్ నిర్వాహకులు తెలిపారు. సీన్ నదిలో ఈత పోటీలు నిర్వహించడం సాధ్యం కాని పరిస్థితిలో నిర్వాహకులు ఏం చేస్తారో అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. పారిస్ తూర్పు దిక్కున ఉన్న మార్నె నదిలో పోటీలు నిర్వహిస్తారని చాలా మంది భావిస్తున్నారు.