calender_icon.png 23 December, 2024 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.16 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

23-12-2024 01:13:07 AM

ఫేస్‌బుక్‌లో యువకుడ్ని పరిచయం చేసుకుని వసూలు చేసిన యువతి

మరో యువకుడి సహకారం

ఇద్దరిని అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు

ఖమ్మం, డిసెంబర్ 22 (విజయక్రాంతి): సైబర్‌క్రైం కేసులో ఇద్దరు నిందితులను ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు విశాఖపట్నంలో అరెస్ట్ చేసినట్టు పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ ఆదివారం ప్రకనటలో తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్‌కు చెందిన సరిపల్లి శ్రీకాంత్, విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం నాయుడుతోట గ్రామానికి చెందిన వంకర లావణ్య ఇద్దరు జల్సాలకు అలవాటుపడ్డారు.

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో బ్యాంక్ అకౌంట్, ఫేస్‌బుక్ ఖాతాలను తెరిచారు. సత్తుపల్లికి చెందిన యువకుడిని ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకున్న లావణ్య అతనితో తరచూ చాటింగ్ చేస్తూ పరిచయం పెంచుకుంది. తన తల్లి ఆరోగ్యం బాగాలేదంటూ పలుమార్లు యువకుడి నుంచి రూ.16,05,778 డబ్బులు తీసుకుంది. కొన్ని రోజుల తర్వాత బాధిత యువకుడు  తన డబ్బులు కావాలని లావణ్యకు ఫోన్ చేసి అడిగాడు.

ఈ క్రమంలోను శ్రీకాంత్ సదరు యువకుడిని బెదిరిం చాడు. లావణ్య తన చెల్లెలని, ఎందుకు వేధిస్తున్నావని, అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నా యని, ఫొటో మార్పింగ్ చేసి, సోషల్‌మీడియాలో పెడతానని బెదిరించాడు. బాధిత యువకుడి ఫిర్యాదు మేరకు ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితులను విశాఖపట్నంలో అరెస్ట్ చేసి, అక్కడి నుంచి ఖమ్మం తీసుకువచ్చి సైబర్ క్రైమ్ కోర్టులో హాజరుపర్చారు.