calender_icon.png 20 April, 2025 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సంస్కృతం’ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

12-04-2025 12:14:20 AM

పలు అధ్యాపక సంఘాల డిమాండ్

హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతం సబ్జెక్ట్‌ను ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని అధ్యాపక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీఎల్ ఏ), తెలంగాణ ఇంటర్మీడియెట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ (టిగ్లా), ఇంటర్ విద్యా జేఏసీ శుక్రవారం వేర్వేరుగా విడుదల చేసిన ప్రకటనల్లో డిమాండ్ చేశాయి. 

ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు లేని సంస్కృత భాషను ఇంటర్మీడియెట్‌లో సంస్కృత ఓనమాలను ప్రవేశపెట్టడం ఎంతవరకు సమంజసమని టీజీఎల్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కనకచంద్రం ప్రశ్నించా రు. దేశంలో మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో సంస్కృత భాష ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకోవడం విచారక రమన్నారు.

ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఇంటర్ విద్యా కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించినట్టు ఆయన తెలిపారు. ఇంటర్మీడియెట్ వరకు తెలుగు తప్పనిసరి చేయాలని టిగ్లా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం జంగయ్య, ఎస్‌కే నయీ మ్ పాషా డిమాండ్ చేశారు.