11-04-2025 01:03:40 AM
మానకొండూర్ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ
మానకొండూర్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం పథకం అమలు చేయడం విప్లవాత్మకమని మానకొండూర్ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.
శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామంలో గురువారం సన్న బియ్యం లబ్దిదారుడు చలిగంటి గణేష్ ఇంట్లో సన్న బియ్యంతో వండిన అన్నంతో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్ సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీతో 80 శాతానికి పైగా బడుగు బలహీన వర్గాల ప్రజలు ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం పేదవాడి ఆత్మగౌరవ పథకమని తెలిపారు. దేశ చరిత్రలోనే సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఏ రాష్ట్రం లోనూ సన్న బియ్యం పంపిణీ చేయడం లేదని, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ప్రభుత్వం సన్నబి య్యాన్ని పంపిణీ చేస్తున్నదని, ప్రజలంతా ఈ సన్నబియాన్ని వినియోగించుకోవాలని సూచిం చారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు.
రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు అందించి తీరుతామని, పేద ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి వినూత్నంగా ఆలోచన చేసి సన్నబియ్యం పథకాన్ని అమలు చేయ డం తో పేద ప్రజల మనసును దోచుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారుడు చలిగంటి గణేష్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నూతన వస్త్రాలు అందించారు.