విక్టరీ వెంకటేశ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోంది. ఇందులో వెంకటేశ్ మాజీ పోలీస్ పాత్ర పోషిస్తుండగా ఐశ్వర్య రాజేశ్ అతని భార్యగా, మీనాక్షి చౌదరి మాజీ ప్రేయసిగా కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి.
ఇందులో వెంకటేశ్ ఓ పాడారు. ఆ గీతాన్ని థర్డ్ సింగిల్‌గా చిత్రబృందం వదలనున్నది. ఈ పొంగల్ సాంగ్‌ను డిసెంబర్ 30న రిలీజ్ చేయనున్నారు. సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో హీరో వెంకటేశ్‌తోపాటు హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ కలర్‌ఫుల్, సిగ్నేచర్ డ్యాన్స్ మూమెంట్‌తో కనిపించడం అందరినీ ఆకట్టుకుంది.
జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రానికి సమర్పణ: దిల్ రాజు; బ్యానర్: శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్; సంగీతం: భీమ్స్ సిసిరోలియో; సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి; ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాశ్; ఎడిటర్: తమ్మిరాజు; స్క్రీన్‌ప్లే: ఎస్ కృష్ణ, జీ ఆదినారాయణ; యాక్షన్ కొరియోగ్రఫీ: వీ వెంకట్; నిర్మాత: శిరీష్; రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి.