calender_icon.png 28 April, 2025 | 9:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసులు కురిపిస్తున్న ఇసుక దందా..!

28-04-2025 12:44:09 AM

  1. తెలంగాణ నుంచి కర్ణాటకకు తరలింపు
  2. టోల్ ప్లాజా వద్ద పట్టుబడుతున్న వైనం
  3. ఇస్మాయిల్ఖాన్ పేట నుంచి ఇసుక రవాణా
  4. అక్రమ రవాణాలో హస్తం ఎవరిది ?
  5. పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్ అధికారులు

మునిపల్లి, ఏప్రిల్ 27 : అనుమతులు లేని ఇసుక రవాణా అక్రమార్కులకు కాసు లు కురిపిస్తోంది...దొడ్డిదారిన ఇసుకను తరలిస్తూ పట్టుబడుతూ..కేసులు నమోదవుతు న్నా యథేచ్ఛగా ఇసుక దందా మాత్రం కొనసాగుతుంది..సంగారెడ్డి జిల్లా కేంద్రంకు కూతవేటు దూరంలో ఉన్న ఇస్మాయిల్ఖాన్ పేట నుండి ఇసుక రవాణా సాగిస్తున్నారు.

ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా కొనసాగిస్తున్నా అధికారులు మా త్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమార్కులు అక్రమంగా తరలిస్తున్న ఇసుకను కర్ణాటకలోని బీదర్కు తరలి స్తున్నారు. అయితే ఇసుక  టిప్పర్లు సంగారెడ్డి మీదుగా ముంబాయి జాతీయ రహదా రి గుండా బీదర్కు వెళ్ళాల్సి ఉంటుంది.

కానీ అక్రమార్కులు ఏ రూటులో వస్తున్నారో గానీ మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లా జా వద్ద పోలీసుల తనిఖీలో దొరికిపోతున్నాయి. ఈ ఏప్రిల్ మాసంలోనే ఇప్పటి వర కు మూడు టిప్పర్ల ఇసుకను పట్టుకోవడం జరిగింది. అయినప్పటికీ ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. 

ఇందిరమ్మ ఇండ్ల పేరిట దోపిడీ..?

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఉచిత ఇసుకను అందించాలని భావించింది. ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు అక్రమం గా ఇసుకను కర్ణాటక రాష్ట్రంలో అధిక ధరకు అమ్ముకుంటూ జేబులు నింపుకుంటున్నా రు. ఈనెలలో పట్టుబడిన ఇసుక టిప్పర్లు ఇసుకను ఇస్మాయిల్ఖాన్ పేట నుండి తీసుకువచ్చినట్లు పోలీసుల నిర్ధారణలో తేలింది.

కొందరు ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుకను తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. సంబంధిత అధికారులు దృష్టిసారించక పోవడం వల్లనే యథేచ్ఛగా ఇసుక రవా ణా కొనసాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు కట్టడి చేయకపోవడం వల్లనే ఇసుక రవాణా జోరుగా సాగుతుందని తెలుస్తోంది. 

నిద్రావస్థలో అధికారగణం..

తెలంగాణ నుండి కర్ణాటక రాష్ట్రానికి యథేచ్ఛగా ఇసుక రవాణా కొనసాగిస్తున్నా సంబంధిత అధికారులు మామూళ్ళ మత్తు లో పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం సమాచారం అంది తేనే తనిఖీలు చేయడం..ఇసుక టిప్పర్లు, ట్రాక్టర్లు పట్టుకోవడం జరుగుతుంది.

ఆ తర్వాత మళ్లీ దందా యధావిధిగా కొనసాగుతుంది. అసలు ఈ అక్రమ ఇసుక దందా లో ఎవరి హస్తముందో నిర్ధారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  ఈ అక్రమ ఇసుక దందాను నియంత్రించాల్సిన అధికారులు ఇప్పటికైనా పట్టించుకొని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.