calender_icon.png 19 January, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘తిరుమల’ పవిత్రతను కాపాడాలి

07-07-2024 01:46:37 AM

అన్యమతస్థులను ఉద్యోగాల నుంచి తొలగించాలి

ఏపీ సీఎం చంద్రబాబుకు ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ లేఖ

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలో జరిగిన అవినీతి, అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని టీటీడీ పవిత్రతను కాపాడాలని ఏపీ సీఎం చంద్రబాబుకు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ లేఖ బహిరంగ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. టీటీడీలో అన్య మతస్థులు కొలువులు చేయడం దారుణమన్నారు.

ఇప్పటికైనా ఆయా స్థానాల్లో హిందువులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పక్కదారి పట్టిన సొమ్మును తిరిగి వసూలు చేయాలని కోరారు. స్వామివారికి భక్తులు ఇచ్చిన కానుకలు, విరాళాలు, హుండీ ఆదాయంపై పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహించాలని, ఉచిత దర్శనంపై పరిమితి ఎత్తి వేయాలని, అందరినీ దర్శనానికి అనుమతించాలన్నారు. టీటీ డీ వసతి గృహాల్లో గదుల అద్దె భారీగా పెంచారని, సామాన్యుల కోసం అద్దెలను తగ్గించాలని కోరారు. ఐదేళ్లుగా క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు అన్నపానీయాలు సక్రమంగా అందలేదని, భక్తులకు సకాలంలో వాటిని అందించాలన్నారు. లడ్డూ ప్రసాదం నాణ్యత నానాటికీ క్షీణిస్తూ వస్తోందన్నారు. లడ్డూ నాణ్యతను పునరుద్ధరించాలన్నారు.