- ఢిల్లీలో 400కుపైన ఏక్యూఐ నమోదు
- నగరాన్ని కమ్మేస్తున్న పొగమంచు
న్యూఢిల్లీ, నవంబర్ 16: ఢిల్లీలో వరుసగా నాలుగో రోజూ భారీ స్థాయిలో కాలుష్య స్థాయిలు నమోదయ్యాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) డాటా ప్రకారం శనివారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 406 నమోదైంది.
జహంగీర్‌పురి, బురారీ క్రాసింగ్, బవానా ప్రాంతాల్లో తీవ్ర స్థాయి వాయు కాలుష్యం ఉన్నట్లు తెలిపింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లోనూ విజిబిలిటీ 500 మీటర్లకు పడిపోయింది. దీంతో పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు.
నగరంలో కాలుష్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మూడో దశ ఆంక్షలను విధించారు. ట్రాఫిక్ నిబంధనలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల సమయాలను కూడా మార్చారు. ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రజారవాణాను పెంచేందుకు మెట్రో సేవలను పెంచారు.