calender_icon.png 3 April, 2025 | 5:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదే పౌరుషం.. అదే రోషం.. తగ్గేదేలే

18-03-2025 12:00:00 AM

నందమూరి కళ్యాణ్‌రామ్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’. విజయశాంతి ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రని పోషిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్, ముప్పా సునీల్ బలుసు నిర్మించారు. ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ తాజాగా హైదరాద్‌లో లాంచ్ చేశారు.

ఈ ఈవెంట్‌లో విజయశాంతి మాట్లాడుతూ.. “సరిలేరు నీకెవ్వరు’తర్వాత ఒక యాక్షన్ సినిమా చేయమని చాలామంది కోరారు. ఈ సినిమాలో అలాంటి యాక్షన్ కుదిరింది. చాలా రోజుల తర్వాత యాక్షన్ చేశాను. నేను యాక్షన్ ఎలా చేస్తానో అని యూనిట్‌లో కొంత టెన్షన్ పడ్డారు. అయితే యాక్షన్ చెప్పిన వెంటనే అలా నేచురల్‌గా చేసేసాను.ఎప్పుడూ విజయశాంతినే. అదే పౌరుషం.. అదే రోషం.

తగ్గేదేలే. ఎంత ఏజైనా ఇలానే స్ట్రాంగ్‌గా ఉంటాను” అన్నారు. కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ.. “కర్తవ్యం సినిమాలో వైజయంతి క్యారెక్టర్‌కి కొడుకు ఉంటే ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి అనేది ఈ కథ. అయితే అమ్మ (విజయశాంతి) ఒప్పుకుంటేనా ఈ సినిమా చేద్దామని అన్నాను. ఈ సినిమా మెయిన్ పిల్లర్ అమ్మ. ఈ వయసులో కూడా అమ్మ ఎలాంటి డూప్ లేకుండా అద్భుతమైన స్టంట్స్ చేశారు.

పృథ్వీ చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. ఈ సినిమాకి ఆయనే డబ్బింగ్ చెప్పారు” అని తెలిపారు. పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ‘నేను ఇండస్ట్రీలో చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇప్పుడిప్పుడే మంచి టైం వచ్చింది. యానిమల్ తర్వాత లైఫ్ మారింది. ఇప్పటివరకు దాదాపు 300 సినిమాలు చేశాను. ఎన్నో వెరైటీ క్యారెక్టర్స్ చేశాను. నా కెరియర్లో ఇప్పటి వరకూ ద బెస్ట్ మోస్ట్, డిఫికల్ట్ రోల్ అంటే ఈ సినిమాలోనిదే’ అన్నారు.

డైరెక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ.. ‘ఈ కథ కళ్యాణ్ రామ్ గారికి చెప్పినప్పుడు కథ బాగుంది విజయశాంతి మేడం ఒప్పుకుంటేనే చేద్దామని అన్నారు. మేడం యాక్సెప్ట్ చేయడంతో ఈ ప్రాజెక్టు ముందుకెళ్ళింది’ అన్నారు. ప్రొడ్యూసర్ సునీల్ బలుసు మాట్లాడుతూ.. ‘ఈ సినిమాని మేడం ఒప్పుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాకి మేడం బ్యాక్ బోన్. ఆమె లేకపోతే ఈ ఫిలిం ఈ స్కేల్లో అయ్యేది కాదు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది’ అన్నారు. 

టీజర్ ఎలా ఉందంటే..? 

ఐపీఎస్ ఆఫీసర్ విజయశాంతి విధి నిర్వహణలో నేరస్థులపై కాల్పులు జరపడంతో టీజర్ ప్రారంభమవుతుంది. చావుకి ఎదురెళ్ళిన ప్రతిసారి ఆమెకు కొడుకు అర్జున్ ముఖం గుర్తుకు వస్తుంది. వైజాగ్‌లో నేరస్థులని నియంత్రించడంలో పోలీసులు, కోర్టులు రెండూ విఫలమైనప్పుడు, అర్జున్ పరిస్థితని తన చేతుల్లోకి తీసుకుంటాడు. చట్టాన్ని ధిక్కరించే ఎవరినీ శిక్షించకుండా ఉండనివ్వనని విజయశాంతి చెప్పడం, అర్జున్ అమ్మకు బర్త్ డే విషెష్ చెప్పడంతో టీజర్ ఎండ్ అవ్వడం చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది.