calender_icon.png 24 November, 2024 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే ఉద్యోగి మూడుసార్లు బదిలీ!

23-10-2024 01:10:43 AM

  1. వైద్యారోగ్యశాఖలో అక్రమ బదిలీలు
  2. సాధారణ బదిలీల పేరిట అక్రమాలు
  3. కాసులిస్తే చాలు కావాల్సిన చోటికి.. 
  4. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో చక్రం తిప్పుతున్న ఓ ఉద్యోగి
  5. అక్రమ బదిలీలపై కోర్టుకెక్కిన ఉద్యోగులు

మోసర్ల శ్రీనివాస్‌రెడ్డి :

కామారెడ్డి, అక్టోబర్22 (విజయక్రాంతి) : వైద్యారోగ్య శాఖలో అక్రమ బదిలీల జాత ర కొనసాగుతోంది. కాసులిస్తే చాలు సర్కా రు జీవోలు చెత్త పేపర్ల మాదిరిగా మార్చేస్తున్నారు పలువురు అక్రమార్కులు. అడిగిన కాడికి సమర్పిస్తే అనుకున్న చోటికి పోస్టింగ్ వేయించుకోవచ్చు అన్నట్టు జరుగుతోంది వ్యవహారం.

డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం లో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి ఈ అక్రమ బదీలీల వ్యవహారాలను నడుపుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతా ధికారి కార్యాలయంలోనే అక్రమాలు జరుగుతుండటంతో కిందిస్థాయి ఉద్యోగులు ఏమి మాట్లాడలేకపోతున్నారు. ఒకరి కోసం మరో ఉద్యోగిని మూడుసార్లు బదిలీ చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. 

జూలైలో వైద్యారోగ్యశాఖలో సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. బదిలీలకు అవకాశం కల్పిస్తూ జీవో నంబర్ 80ను జూలై 3న జారీ చేసింది. దీంతో 201 8 నుంచి బదిలీ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులు బదిలీకి సిద్ధమయ్యారు. జూలై 18 నుంచి కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు. 

సిద్దిపేట టు సిరిసిల్ల టు కామారెడ్డి.. 

సిద్దిపేట జిల్లా వైద్యారోగ్యాశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న శ్రీధర్‌బాబు కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు. ఆయనను సిరిసిల్ల డీఎంహెచ్  కార్యాలయానికి ట్రాన్స్‌ఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కానీ, ఆయన సిద్దిపేట కార్యాలయంలోనే కొనసాగారు. జూలై 27న శ్రీధర్‌బాబును మరోసారి కామారెడ్డి మెడికల్ కళాశాల సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. శ్రీధర్‌బాబు సిద్దిపేట నుంచి రిలీవ్ కాలేదు.

అప్పటికే సిరిసిల్ల జనరల్ ఆసుపత్రి నుంచి కామారెడ్డి మెడికల్ కళాశాలకు బదిలీపై వచ్చిన నక్క అనిల్‌కుమార్‌ను 9 రోజు ల వ్యవధిలోనే మరోసారి బదిలీ చేశారు. కామారెడ్డి నుంచి అతడిని సిద్దిపేట డిఎంహెచ్‌వో కార్యాలయానికి బదిలీ చేస్తూ జూలై 27న ఆర్డర్ ఇచ్చారు. ఆ వెంటనే అనిల్‌కుమార్ సిద్దిపేటలో జాయిన్ అయ్యారు.

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కామారెడ్డి మెడికల్ కళాశాల నుంచి సిద్దిపేట జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయానికి సూపరింటెండెంట్‌గా బదిలీ అయిన నక్క అనిల్‌కు మార్ ఆర్డర్ కాపీలో మాత్రం సిరిసిల్ల జనర ల్ ఆసుపత్రి నుంచి సిద్దిపేట జనరల్ ఆసుపత్రికి బదిలీ చేసినట్టు పేర్కొనడం గమనా ర్హం.

కామారెడ్డి మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న వ్యక్తిని సిరిసిల్ల నుంచి సిద్దిపేటకు బది లీ చేస్తున్నట్టు వెలువడిన ఉత్తర్వులను పరిశీలిస్తే వీరి వెనుక డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాల యంలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఉన్నట్టు తెలుస్తోంది. జూలై 31న శ్రీధర్ బాబును మరోసారి సిద్దిపేటకు బదిలీ చేస్తున్నట్టు జిల్లా వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేశారు.

సిద్దిపేటలో విధులు నిర్వహిస్తున్న నక్క అనిల్‌కుమార్‌ను మళ్లీ కామారెడ్డి మెడికల్ కళాశాలకు సూపరింటెండెంట్‌గా బదిలీ చేసినట్లు ఉత్తర్వులు ఇచ్చినట్టు సమాచారం. దీంతో శ్రీధర్‌బాబు ఆగస్టు 7న తిరిగి సిద్దిపే ట జిల్లా వైద్యాఆర్యోగశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధుల్లో చేరారు.

సిద్దిపేటలోనే అనిల్‌కుమార్

అయితే, అనిల్‌కుమార్ మాత్రం కామారెడ్డి మెడికల్ కళాశాలలో విధుల్లో చేరకుండా సిద్దిపేటలోనే కొనసాగుతున్నారు. కామారెడ్డికి బదిలీ అయినా సిద్దిపేటను వదిలే ప్రసక్తి లేదని మొండికేస్తున్నట్టు సమాచారం. తనను సిద్దిపే టలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాల ని హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిసిం ది.

బదిలీ వ్యవహరంలో కొనసాగుతున్న వివాదానికి పుల్‌స్టాప్ పెట్టేందుకు సిద్దిపేట డీఎంహెచ్‌వో.. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో ఉన్న ఉన్నతాధికారుల ను కలిసి ఈ ఇద్దరు అధికారుల సమస్యను వివరించారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయ అధికారులు మాత్రం విచిత్రమైన ఉత్తర్వులను వెలువరించారని శ్రీధ ర్‌బాబు ‘విజయక్రాంతి’ ప్రతినిధితో తెలిపారు.

అనిల్‌కుమార్‌ను సిద్దిపేటలోనే కొనసాగాలని శ్రీధర్‌బాబును కామారెడ్డి మెడికల్ కళాశాలలో సూపరిడెంట్‌గా చేరాలని ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. జీవో నెంబర్ 87కు విరుద్ధంగా ఉన్న ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ శ్రీధర్‌బాబు సైతం తనకు న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు.

ఏది ఏమైనా నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారనే దానికి ఒకే ఉద్యోగిను మూడుసార్లు బదిలీ చేయడమే నిదర్శనం. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో కొందరు ఉద్యోగులు కాసులకు కక్కుర్తి పడి అక్రమ బదిలీలు చేయిస్తున్నారని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.