calender_icon.png 4 April, 2025 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌సీయూ స్థలాన్ని విక్రయాన్ని విరమించుకోవాలి

03-04-2025 12:00:00 AM

బీజేపీ ముషీరాబాద్ జాయింట్ కన్వీనర్ ఎం.నవీన్ గౌడ్

ముషీరాబాద్, ఏప్రిల్ 2: (విజయక్రాంతి) : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం అమ్మేందుకు ప్రయత్నిస్తున్నదని, వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ముషీరాబాద్ నియోజకవర్గం బిజెపి జాయింట్ కన్వీనర్ ఎం. నవీన్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ మేరకు బుధ వారం హెచ్‌సీయూ స్థలాల పరిరక్షణ కోసం బిజెపి మహిళా మోర్చా కమిటీ అధ్యక్షురాలు శిల్పారెడ్డి చేపట్టిన నిరసన కార్యక్రమా న్ని పోలీసులు అడ్డుకొని తరలించారు. ఈ సందర్భంగా ఆయన బిజెపి నాయకులను కలిసి మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

హెచ్సీ యూ స్థలాన్ని కాపాడేందుకు విద్యార్థులు, బిజెపి నాయకులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అరెస్టులు చేసి, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పం దించి ప్రభుత్వ స్థలం విక్రయాన్ని నిలిపివేయాలని, లేని పక్షంలో బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హెచ్చరిం చారు.

ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు కంచి ముదిరాజ్, బీజేవైఎం అధ్యక్షుడు ఆయుష్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసు, మహిళా కమిటీ మోర్చా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.