calender_icon.png 9 October, 2024 | 2:27 PM

గంజాయి విక్రయించిన, సేవించిన కఠిన చర్యలు తప్పవు

09-10-2024 12:00:59 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): గ్రామాల్లో గంజాయి సాగుచేసిన, విక్రయించిన, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని బెల్లంపల్లి రూరల్ సీఐ సయ్యద్ అఫ్జలొద్దీన్ హెచ్చరించారు. బుధవారం బెల్లంపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని నెన్నల మండలం నార్వాయిపేట గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా సిఐ గ్రామస్తులతో మాట్లాడారు. గంజాయికి అలవాటు పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఎక్కడైనా గంజాయి సాగుచేసిన, విక్రయించిన, సేవించిన సమాచారం తెలిస్తే పోలీసులకు తెలపాలన్నారు. అదేవిధంగా సైబర్ క్రైమ్, డయల్ 100, షీ టీమ్స్, గుడుంబా నిర్మూలన, మోటార్ వెహికల్ చట్టాలు, మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నెన్నల , తాళ్ల గురజాల, బెల్లంపల్లి టూ టౌన్ ఎస్సైలు ప్రసాద్, రమేష్, మహేందర్ లతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.