calender_icon.png 12 January, 2025 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేల వేతనమూ కట్ చేయాలి!

29-07-2024 02:10:04 AM

ప్రజాసేవలో మేమూ జీతగాళ్లమే..

కాలేజీ పిల్లల్లా సభలో అల్లరి చేస్తున్నారు

ప్రజలకు పనికొచ్చే విషయాలపై చర్చే లేదు

బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): ప్రస్తుత సీఎం, మాజీ సీఎంను ఓడించి చరి త్ర సృష్టించారాయన.. రాష్ట్ర రాజకీయాల్లో ఆయనో జాయింట్ కిల్లర్.. రోడ్డు విస్తరణ కోసం తొలుత తన ఇంటినే కూల్చేందుకు ముందుకొచ్చిన ప్రజానాయకుడు.. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి వినూత్నంగా ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేసి వార్తల్లో నిలిచిన నేత బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి. అసెంబ్లీ సమావే శాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ జీతగాళ్లేనని, అసెంబ్లీలో లేని సమయంలో సభ్యులకు వేతనాలను కట్ చేయాలని పేర్కొన్నారు. వెంకటరమణారెడ్డి ‘విజయక్రాంతికి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూ విశేషాలు..

శాసన సభ  సరిగా జరగడం లేదని అసంతృప్తి మీలో ఎందుకుంది?

అధికార పక్షం, ప్రతిపక్షం ప్రజల కోసమే పనిచేయాలి. అధికార పార్టీ ఏదైనా తప్పు చేస్తే విపక్షాలు దాన్ని ఎత్తి చూపాలి. ఆ తప్పు ను సరిద్దిదుకునేలా ఉండాలి. ప్రభుత్వం కూడా దాన్ని సరిదిద్దేలా ప్రతిపక్షాల నుంచి సూచనలు తీసుకోవాలి. అలా కాకుండా, సభలో మీరు దొంగ అంటే.. మీరే దొంగ అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మీది మేనేజ్‌మెంట్ సీటు అని ఒకరు, మీది పేమెంట్ అని మరొకరు అనుకోవడం తప్ప ప్రజలకు పనికొచ్చే అంశాలపూ మాట్లాడటం లేదు. లిడ్‌క్యాప్ ప్రస్తుతం కనుమరు గయ్యే పరిస్థితిలో ఉంది.

1998 డీఎస్సీ అభ్యర్థులకు ఇంకా ఉద్యోగం ఇవ్వలేదు. ఈ విషయాన్ని 26 ఏళ్లుగా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. టీఏలు, డీఏలు రావాల్సిన పోలీసులు కూడా ఇబ్బందిపడుతున్నారు. హోంగార్డుల సమస్య ఉంది. టీచర్లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, గెస్ట్ లెక్చరర్ల సమస్యలు అలాగే ఉన్నాయి. అలాగే, స్కూళ్లలో నైట్ వాచ్ మెన్లు లేరు. ఉపాధ్యాయ పోస్టుల నియామకాలు లేవు. స్కూళ్ల బల్డింగులు సరిగా లేవు. బాత్రూమ్‌లు ఉండవు. దవాఖానల్లో డాక్టర్లు ఉండరు. రాష్ట్రంలోని ప్రజల గురించి ఆలోచించేవాళ్లు లేరు. 

శాసన సభలో ఎమ్మెల్యేలు ఎలా ఉండాలి?

శాసన సభలో ఒక పద్ధతిలో వ్యవహరించాలి. భవిష్యత్ వ్యూహంతో ముందుకుపో వాల్సిన అవసరం ఉంది. ఉచితాలపై ఉన్న ఆలోచన.. అసలు ప్రజలకు ఏమి కావాలన్న అంశంపై చర్చించడం లేదు. 

ఉద్యోగి సమయానికి ఆఫీసు రాకుంటే జీతం కట్ చేస్తారు? అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ఎందుకు వర్తించదని అన్నారు. అలా ఎందుకు అనాల్సి వచ్చింది? 

మేము కూడా ప్రజలకు జీతగాళ్లమే. మేము పని చేయనప్పుడు జీతం ఎందుకు కట్ చేయరు. ప్రజాస్వామ్యంలో అందిరికీ ఒకే నిబంధనలు అమలు చేయాలి. ప్రజాప్రతినిధులను ప్రత్యేకంగా ఎందుకు చూడాలి? మేము 24 గంటలు ప్రజలకు అందుబాటు లో ఉండాలి. ప్రజా సమస్యలను పరిష్కరించాలి. వాటి గురించి అసెంబ్లీలోమాట్లాడాలి. చట్టం చేసే దగ్గర పద్ధతిగా ఉండకుంటే ఎలా? రోజు క్వశ్చన్ అవర్ తీసేస్తున్నారు. రేపు అసెంబ్లీ అయితే చర్చించే విషయాలను ఈ రోజు రాత్రి 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు.

ఇదేం పద్ధతి. కాలేజీ పిల్లలు అల్లరి చేసినట్టు అసెంబ్లీలో గోల చేస్తున్నారు. ఒక సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు.. అక్కడక్కడ ఇద్దరు, ముగ్గురు చొప్పున ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని కూడా ఇదే అన్నారు. టైంపాస్ కోసం సభకు వచ్చి కూర్చుంటున్నారు. తర్వాత వెళ్లి రూముల్లో కూర్చుంటున్నారు. అక్బరుద్దీన్ తన స్పీచ్ అప్పుడు రెండు గంటలు వచ్చి తర్వాత వెళ్లిపోతారు. మిగతా వాళ్లతో ఆయనకు సంబంధం లేదు. ప్రతి సభ్యుడు అలాగే తయారైతే అసెంబ్లీకి విలువ ఉంటుందా?

అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య మాటల సందర్భంలో..  ‘మీరు అప్పుడు అన్నారు కాబట్టి.. ఇప్పుడు అంటున్నాం’ అనే కొత్త సంప్రదాయం వచ్చింది. దీనిపై మీరేం అంటారు?

నేను ఆ పరిస్థితిలో ఉంటే పాతది మాట్లాడను. గతంలో జరిగిన తప్పులు ఏంటి? వాటిని ఎలా అధిగమించాలి అనే విషయా ల గురించి మాట్లాడుతా. కానీ ఎదుటివాడిపై దుమ్మెత్తి పోయను. ఎదుటోడు తప్పు చేస్తే.. విచారణకు ఆదేశించాలి. కానీ పదేపదే నువ్వు దొంగ నువ్వు దొంగ అనడం ఏంటి? అప్పులు ఎన్ని ఉన్నాయో పాలకులు కాదు, సీఎస్‌తో చెప్పిస్తే ఇంకా  

శాసన సభ ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు?

జిల్లా పరిషత్ సమావేశంలో జిల్లాలకు సం బంధించిన అధికారులు పాల్గొంటారు. మండల పరిషత్ సమావేశంలో కూడా సంబంధిత ఆఫీసర్లు పాల్గొంటారు. మున్సిపల్ కౌన్సిల్‌లో అధికారులు పాల్గొని మాట్లాడుతారు. మరి అసెంబ్లీకి అధికారులు ఎందుకు రారు? ఉన్నతాధికారులు కూడా అసెంబ్లీకి వచ్చేలా చట్టం చేయాలి. ఉన్నతాధికారులు అసెంబ్లీ వస్తే.. ప్రతిపక్షాలు ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు. అప్పుడు వాటికి ఒక విలువ ఉంటుంది. రాజకీయ నాయుకులు చెప్పిన దానికంటే.. అధికారులు చెప్తే.. దానికో అథంటికేషన్ ఉంటుంది. సమస్య పరిష్కారం అవుతుంది. అసెంబ్లీకి ఉన్నతాధికారులు వచ్చేలా చట్టం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

నిజంగా రైతు రాజు అవుతాడా?

రైతులను పట్టించుకునేటోళ్లు లేరు. వారి కి మద్దతు ధర లేదు. రైతుబంధుతో అన్నదాతను బిచ్చపోన్ని చేస్తున్నారు. రైతు రాజు అయితే లీడర్ సున్నా అయితడు. అందుకే పాలకులు రైతును రాజును చేయరు. రాష్ట్రంలో కాంట్రాక్టు విధానం మాయమవుతున్నది. ఔట్ సోర్సింగ్ వాళ్లను ప్రోత్సహిస్తున్నారు. కొత్త రిక్రూట్‌మెంట్లు కావడం లేదు. సెలె క్ట్ అయినవారికి పోస్టింగులు ఇవ్వడం లేదు. రిటైర్ అయిన వాళ్ల ను తీసుకొచ్చి ఓఎస్డీగా పెట్టుకున్నారు. దీంతో ఇటు ప్రభుత్వ జీతం, అటు పెన్షన్ రెండూ పొందుతున్నారు.

ఇలా రూ.లక్షలు వృథా అవుతున్నాయి. వారికి బదులు కొత్త వారిని నియమించుకుంటే ఓ 50 మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయి కదా? ఇప్పుడున్న యువతకు ఆ ఉద్యోగాలను కాంట్రా క్ట్ పద్ధతిన ఎందుకు ఇవ్వరు? ఇది ఎంత వరకు కరెక్టు. సభలో కక్షతో ఉండాలని నేను అనడం లేదు. కానీ, సమస్యపై ప్రజల పక్షాన మాట్లాడాలని కోరుతున్నా. ఇప్పు డు నేను చెప్పిన సమస్యల్లో సభలో ఏ ఒక్క విషయాన్ని అయినా తీసుకొని మాట్లాడా రా? ఇన్ని రోజులు జరిగిన సభలో ప్రజలు ఈ బాధ ఉన్నది మాట్లాడిన వాళ్లు ఉన్నారా? 

ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు భావోద్వేగానికి గురయ్యారు. మీ నాన్న ఆ కుర్చిలో కూర్చోవాలని కలలు కన్నారు. ఇప్పుడు మీరు సాధించారు? ఇప్పుడు అసెంబ్లీ తీరు చూసిన తర్వాత మీకు ఏం అనిపిస్తుంది?

చాలా బాధేస్తుంది. క్రమ శిక్షణ లేదు. మాట్లాడే పద్ధతి సరిగా లేదు. ఏదో చేస్తారని లక్షల మంది ఓట్లేసి సభకు పంపిసే. ఇక్కడ ప్రజా సమస్యలపై సీరియస్‌గా చర్చించకుండా.. ఒకరితో ఒకరు నవ్వు తూ సరదాగా గడుతున్నారు. చుట్టుపక్కల వందల మంది పోలీసులు కాపలా ఉండేది ఇందుకోసమేనా?