n బీజేపీ అభ్యర్థి మాధవిలత
చాంద్రాయణగుట్ట, ఏప్రిల్ 21 (విజయక్రాంతి) : దేశం కోసం.. ధర్మం కోసం మోదీ ప్రధాని అయ్యేందుకు మనమందరం కృషి చేయాలని హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవిలత అన్నారు. ఆదివారం యాకుత్పురా నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆమె పాదయాత్ర నిర్వహిం చా రు. కుల, మతాలకు అతీతంగా ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరిని అప్యాయంగా పలకరించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాతబస్తీ ప్రజల కోసమే మజ్లిస్ పార్టీ పని చేస్తుందని అసదుద్దీన్ అంటున్నారు. ఎందు కు ఇప్పటికీ బస్తీలో సరైన అభివృద్ధి జరగలేదన్నారు. ఏ గల్లీలో చూసిన కంపు కొడు తుందన్నారు. మతంకు సంబంధం లేకుండా తనను అదరిస్తున్నారని పేర్కొన్నారు. పాతబస్తీలో మార్పు రావాలంటే హైదరాబాద్ గడ్డపై కాషాయం జెండ ఎగరవేయాలని అప్పుడు అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామన్నారు. ఈ పాదయాత్రలో భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.