వికారాబాద్, జనవరి 30: మహనీయుల త్యాగమే మనము పొందుతున్న స్వతంత్ర ఫలాలని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం, మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ వివిధ శాఖల సిబ్బందితో కలిసి అదనపు కలెక్టర్ రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా స్వాతంత్ర సాధనకు తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను స్మరించకోవాలన్నారు. 200 సంవత్సరాలు ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించిన క్రమంలో సాయుధ పోరాటంతో పాటు శాంతియుత పోరా టాన్ని జరిపి స్వాతంత్య్రాన్ని పొందామని ఆయన తెలిపారు.
అల్లూరి సీతారామరాజు, మొదటి తుపాకి పట్టిన మంగలి పాండే, కొమరం భీమ్, దొడ్డి కొమరయ్య లాంటి వారు తమ ప్రాణాలు సహితం అర్పిం చారని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాoఘీక సంక్షేమ అభివృద్ధిఅధికారి మల్లేశం,ఎ ఓ ఫర్హీన్,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.