calender_icon.png 20 April, 2025 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిక్కుల త్యాగం వెలకట్టలేనిది

14-04-2025 12:19:42 AM

కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 13(విజయక్రాంతి) : ధర్మం, దేశం కోసం సిక్కులు చేసిన త్యాగం వెలకట్టలేనిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం బైశాఖి దినోత్సవం సందర్భంగా అమీర్ పేట్ లోని సిక్కుల పవిత్ర ప్రార్థన మందిరాన్ని సందర్శించి ఆయన ప్రార్థనలు చేశారు. అనేక సం వత్సరాలుగా అమీర్ పేట్ లోని గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ భక్తిని చాటు కుంటుందన్నారు.

ప్రధాని మోదీ కూడా గతంలో ఈ గురుద్వారాను సందర్శించి తన భక్తిని చాటుకున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కాగా బైఖాని ఉత్సవాల సందర్భంగా అమీర్‌పేట్ గురుద్వార్, మున్సిపల్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సిక్కు మతపెద్దలు ప్రార్థనలు చేశారు.  సాయంత్రం అ మీర్‌పేట్ గురుద్వార్ సాహెబ్ నుంచి గురుగంథ సాహెబ్ ను వాహనంలో ఊరేగించారు.