calender_icon.png 6 January, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరుల త్యాగం చిరస్మరణీయం

22-10-2024 03:19:18 AM

సౌత్‌వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్

కార్వాన్, అక్టోబర్ 21: పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయమని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్, గోల్కొండ డివిజన్ ఏసీపీ సయ్యద్ ఫయాజ్ పేర్కొన్నారు. పోలీసు అమవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని లంగర్‌హౌస్, గోలొండ పోలీస్‌స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు రఘుకుమార్, సైదులు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

లంగర్‌హౌస్‌లోని డీఫోర్ట్ ఫంక్షన్ హాల్, గోల్కొండ పోలీస్‌స్టేషన్ బంజారా ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన శిబిరంలో పోలీసు సిబ్బందితోపాటు స్థానికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్, గోల్కొండ ఏసీపీ సయ్యద్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు రక్తదానం చేశారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ.. పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. అందరూ రక్తదానం చేయాలని సూచించారు. గోల్కొండ పోలీసులు 52 యూనిట్ల రక్తం సేకరించారు. లంగర్‌హౌస్‌లో సుమారు 170 మందికి పైగా రక్తదానం చేశారు.