- పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
- రైతులు భారీగా హాజరయ్యేలా చూడాలి
- వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, నవంబర్ 27(విజయక్రాం తి): ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం అనేక కార్య క్రమాలు చేపట్టిందని పీసీసీ అధ్యక్షుడు మ హేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఈ నెల 30వ తే దీన మహబూబ్‌నగర్‌లో ప్రజాపాలనలో భాగంగా నిర్వహించే రైతు సభపై బుధవా రం పార్టీ నేతలతో జూమ్ సమావేశం నిర్వహించగా డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తు మ్మల, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తికావస్తున్న నేపథ్యంలో వరంగల్, వేములవా డలో భారీ బహిరంగ సభలు నిర్వహించి వి జయోత్సవాలను నిర్వహించామన్నారు. 30 వ తేదీన మహబూబ్‌గనర్‌లో పెద్దఎత్తున రైతు పండుగ నిర్వహిస్తున్నామని, ఈ రైతు ఉత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను మహబూబ్‌నగర్ సభలో జరిగే రైతు సదస్సులో వివరిస్తామన్నారు. మూడురోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాల వారీగా ఆయా ఇన్‌చార్జ్ మంత్రులు కూడా బాధ్యతలు తీసుకొని సభకు రైతులు భారీగా హాజరయ్యేలా చూడాలన్నారు.