calender_icon.png 20 April, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు మహోత్సవ కార్యక్రమం విజయవంతం చేయాలి

19-04-2025 11:30:05 PM

నిజామాబాద్ (విజయక్రాంతి): ఈ నెల 21, 22, 23వ తేదిలలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే రైతు మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావ్, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విచ్చేయుచున్నారు. ఈ కార్యక్రమం 21వ తేదీనా ఉదయం 10 గంటలకు నిజామాబాదులోని గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం పంట ఉత్పత్తులు, ఆధునిక యాంత్రీకరణ, ఆధునిక వంగడాలు, పసుపు ఆధారిత ఉత్పత్తులకు సంబదించిన పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలు గురించి అవగాహన కల్పించానున్నారు.