calender_icon.png 8 January, 2025 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజర్ల జోరు.. ట్రైలర్ల హోరు!

06-01-2025 12:00:00 AM

పండుగ ఏదైనా చిత్ర పరిశ్రమకు ప్రత్యేకమే. సినీ అభిమానులు కోరుకున్న దాని కన్నా రెట్టింపు వినోదాన్ని పంచుతూ, వారి మెప్పు పొందేందుకు మేకర్స్ పోటీ పడుతుంటారు. మరి వచ్చేది సంక్రాంతి కాబట్టి ఆ సందడిని అప్పుడే తెచ్చేశాయి పలు చిత్రబృందాలు. తాజాగా విడుదలైన టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల టీజర్ల జోరు, ట్రైలర్ల హోరు సినీప్రియుల గుండె వాకిళ్లు సందడిగా మారాయి. 

డల్లాస్‌లో డాకు మహారాజ్ ఈవెంట్ 

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. బాబీ కొల్లి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం డల్లాస్‌లో భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉద యం జరిగింది. 2 నిమిషాల 44 సెకన్ల నిడివితో రూపొందిన ఈ ట్రైలర్‌లో డాకు మహా రాజ్‌గా బాలకృష్ణ పాత్రను పరిచయం చేశా రు. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరో స్థాయికి వెళ్లాయి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.    

మొదటి వైమానిక దాడి ఆధారంగా ‘స్కై ఫోర్స్’ 

అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘స్కై ఫోర్స్’. వీర్ పహరియా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుండగా.. సారా అలీఖాన్, నిమ్రత్ కౌర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సందీప్ కెవ్లానీ, అభిషేక్ కపూర్ దర్శకత్వంలో దినేశ్ విజన్ నిర్మిస్తున్నారు. గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 24న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ఆదివారం విడుదలైంది. భారతదేశ మొదటి వైమానిక దాడి ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. 

కన్నడ చిత్రం ‘కోర’.. 

యాక్షన్ జానర్, పీరియాడిక్ డ్రామాలకు డిమాండ్ ఉన్న తరుణంలోనే కన్నడ నుంచి మరో యాక్షన్ మూవీ రాబోతోంది. ఒరాటశ్రీ దర్శకత్వంలో సునామీ కిట్టి హీరోగా ‘కోర’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో చరిష్మా, పీ మూర్తి ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. డాక్టర్ ఏబీ నందిని, ఏఎన్ బాలాజీ, పీ మూర్తి నిర్మిస్తున్నారు. తాజాగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ మూవీ టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించనున్నారు. 

‘ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు’ 

రాజా కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోంది ‘ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు’ అనే చిత్రం. ఈ సినిమాకు హీరో, రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ సూపర్ రాజా. ఇంకా ఇందులో రమ్య ప్రియ, వంశీ గోనె తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు. 

‘దేవా’.. పవర్‌ఫుల్ పోలీస్ 

షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘దేవా’.  రోషన్ ఆండ్రోస్ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్దే, పావేల్ గులాటి కీలక పాత్ర ల్లో నటిస్తున్నారు. జనవరి 31న  ఈ సినిమా రిలీజ్ కానుండగా టీజర్ ఆదివారం విడుదలైంది. షాహిద్ పవర్‌ఫుల్ పోలీస్‌గా అలరించబోతున్నారు.

‘కానిస్టేబుల్’గా వరుణ్ సందేశ్  

వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం ‘కానిస్టేబుల్’. ఈ చిత్రంతో మధులిక వారణాసి హీరోయిన్‌గా పరిచయం కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను దర్శకుడు త్రినాథరావు నక్కిన రిలీజ్ చేశారు.  

‘రాజు గారి దొంగలు’ వస్తున్నారు! 

లోహిత్ కల్యా ణ్, రాజేశ్ కుంచా డా, జోషిత్ రాజ్‌కుమార్, కైలాస్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్, ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘రాజు గారి దొంగలు’. లోకేశ్ రనల్ హిటాసో దర్శకత్వంలో బంగారునాయుడు నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. 

1980ల నాటి ‘బాదాస్ రవికుమార్’

బాలీవుడ్ నటుడు హిమేశ్ రేష్మియా రాబోయే చిత్రం ‘బాదాస్ రవికుమార్’. 1980ల నాటి నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి మోషన్ పోస్టర్ ఇటీవల విడుదలైంది. ట్రైలర్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 7న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.