హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ యామ లపల్లి సహజ ఐటీఎఫ్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. అమెరికా వేదికగా జరిగిన యూఎస్‌ఏ 31 ఏ టోర్నీ మహిళల డబుల్స్‌లో సహజ-హిరోకో కువాటా (జపాన్) జంట 2-6, 0-6తో మెలానీ-అలీసియా జోడీ చేతిలో ఓటమి పాలైంది. అంతకుముందు వరుస విజయాలతో ఫైన ల్‌కు దూసుకెళ్లిన సహజ ద్వయం.. తుదిపోరులో అదే జోరు కొనసాగించలేకపోయింది. ఇదే టోర్నీ మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో సహజ పరాజయం పాలైంది.