మందమర్రి (విజయక్రాంతి): పట్టణం మున్సిపాలిటీగా ఏర్పారి రెండు దశాబ్దాలు పూర్తయినప్పటికీ ఎన్నికలు జరగకపోవడంతో అభివృద్ధిలో వెనుకబడిందని పొలిటికల్ జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపాలిటీకి వెంటనే ఎన్నికల నిర్వహించాలని డిమాండ్ చేస్తూ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని పాత బస్టాండ్ జయశంకర్ విగ్రహం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పొలిటికల్ జేఏసీ నాయకులు మాట్లాడారు. మున్సిపాలిటీ పైన ఉన్న కేసును పరిష్కరించి 1/70 యెక్క హద్దులు, పరిమితిని నిర్ణయించి ఎన్నికల అంశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి త్వరగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి పాలక వర్గాన్ని ఏర్పాటు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని వారు కమిషనర్ ను కోరారు.
ఎన్నికలు నిర్వహించే వరకు మున్సిపల్ ఎన్నికల సాధన కమిటీ ఆధ్వర్యంలో దశల వారీగా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఆందోళన కార్యక్రమాలు చేపడ తామన్నారు. మున్సిపల్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర కేంద్ర, ప్రభుత్వాల మంత్రులను కలిసి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని వినతి పత్రాలను అందించ నున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు అందుగుల శ్రీనివాస్, సప్పిడి నరేష్, దార రవిసాగర్, జె రవీందర్, మేడిపల్లి సంపత్, కొంగల తిరుపతిరెడ్డి,తోట సురేందర్, ముస్తఫా, బర్ల సదానందం, మద్ది శంకర్, కనకం రవీందర్, ముల్కల రాజేంద్ర ప్రసాద్, రాయబారపు వెంకన్న, జనార్ధన్, మాయా రమేష్,లు పాల్గొన్నారు.