13-03-2025 12:14:36 AM
మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్
కోదాడ, మార్చి 12 : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సహకారంతో కోదాడ పశువుల సంతకు పూర్వవైభవం తెస్తామని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఏపూరి తిరుపతమ్మ సుదీర్ అన్నారు. బుధవారం కోదాడ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం నిర్వహించి మాట్లాడారు.
మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి సూచనతో సంత అభివృద్ధి కోసం మిర్యాలగూడెం, సూర్యాపేట, నేరేడుచర్ల సంతలను పరిశీలించి వచ్చినట్లు పేర్కొన్నారు.అక్కడ సంతలలో జరుగుతున్న తీరును ఇక్కడ అనుసరించాల్సినటువంటి కార్యక్రమాలను గురించి చర్చించారు రైతుల సౌకర్యం కోసం శని,ఆదివారాలతో పాటు ఇక ప్రతి గురువారం గొర్రెల సంత ఉంటుందని రైతులు వ్యాపారస్తులు ఉపయోగించు కోవాలని తెలిపారు.
కోదాడ పశువుల సంత రాష్ర్టంలో అగ్రస్థానంలో నిలపటా నికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చైర్ పర్సన్ కోరారు. వైస్ చైర్మన్ షేక్ బషీర్, సెక్రటరీ రాహుల్, డైరెక్టర్లు. వీరబాబు, సూర్యం, మల్లువెంకటరెడ్డి, శ్రీను, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, అమర్సింగ్, మణెమ్మ , అభిరామ్, నర్సిరెడ్డి, సెక్రటరీ అశోక్ తదితరులు పాల్గొన్నారు.