యూపీ సీఎం యోగి
లక్నో, డిసెంబర్ 17: యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ మరోమారు వివాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో కేవలం రాముడి సాంప్రదాయాలు, కట్టుబాట్లే ఉం టాయనీ.. బాబర్ వారసత్వం, ఆయన జీవనశైలి భారత్‌లో మసకబారుతోందన్నారు. యూపీ అసెంబ్లీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
రాముడు, కృష్ణుడు, బుద్ధుడు పాటించిన నియమాలే భారత్‌లో ఉంటాయి. బాబర్, ఔరంగజేబు విధానాలు, వారి వారసత్వం మసకబారుతోం దని అన్నారు. ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హిందూ ర్యాలీలకు అనుమతించడం, వారు నినిదాలు చేయ డం వల్ల మత ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆరోపించగా.. వారికి సమాధానంగా యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజ్యాంగంలో రాసి ఉందా?
ప్రతిపక్షాల విమర్శలకు సమాధానమిస్తూ సీఎం పలు ప్రశ్నలు సంధించారు. ‘ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో హిం దువుల ఊరేగింపు జరపరాదని రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి ఉందా’ అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి రెచ్చగొట్టే పనులు మీరు మానుకుంటే హిందువులు కూడా నిశ్శబ్దంగా ఉంటారని సీఎం తెలిపారు.
సంభాల్‌లో జరిగిన మతఘర్షణల గురించి కూడా సీఎం ప్రస్తావించారు. 1947 నుంచి అక్కడ 209 మంది హిందువలు హత్యకు గురయ్యారని అన్నారు. ‘ముస్లింలకు అన్యా యం జరిగిందని ఎవరైతే మొసలి కన్నీరు కారుస్తున్నారో వారు హిందువుల గురించి ఒక్క మాటకూడా మాట్లాడకపోవడం గమనార్హం’ అని సీఎం తెలిపారు.