calender_icon.png 10 January, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌ఆర్‌ఆర్ ఉద్యమం మరో లగచర్ల అవుతుంది

10-01-2025 12:25:58 AM

  1. హెచ్‌ఎండీఏ దాకా ఆలైన్‌మెంట్ మార్చాలి
  2. చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం వద్ద నిర్వాసితుల ధర్నా

-హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 9 (విజయక్రాంతి)/ మునుగోడు: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న త్రిపుల్ ఆర్ ప్రాజెక్టుకు శాస్త్రీయ పద్ధతిలో భూసేకరణ చేపట్టాలని, లేదంటే.. చౌటుప్పల్ త్రిపుల్ ఆర్ రైతుల ఉద్యమం మరో లగచర్లకు దారితీస్తుందని నిర్వాసిత రైతులు హెచ్చరించారు.

ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు ఎలాంటి పక్షపాతం లేకుండా భూసే  చేపట్టాలని.. లేదంటే మేం చావడానికైనా సిద్ధపడతాం కానీ, భూములను మా  వదులుకోమని స్పష్టం చేశారు. వలిగొండ మండలానికి చెందిన రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) భూ నిర్వాసితులు చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట గురువారం ధర్నాకు దిగారు.

అంతకుముందు చౌటుప్పల్ ఆర్డీవోకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న రైతులను పోలీసులు అడ్డగించారు.దీంతో రైతులు కార్యాలయం లోపల బైటాయించారు. ఆర్డీవోకు సమస్యలతో కూ  వినతిపత్రం అందజేశారు. అనంతరం హైదరాబాద్ రహదా  బై  ధర్నా చేశారు.

ఈ సందర్భంగా భూనిర్వాసితుల సంఘం కన్వీనర్ చింతల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ త్రిపుల్ అర్ అలైన్‌మెంట్‌ను ఓఆర్‌ఓఆర్ నా  (చౌటుప్పల్ భువనగిరి) వైపు హెచ్‌ఎండీఏ పరిధి 40 కిలోమీటర్లు ఉండగా, కేవ  28 కిలోమీటర్లు మాత్రమే అలైన్‌మెంట్ చేశారన్నారు. ఓఆర్‌ఆర్‌కు దక్షిణం వైపున 40 కిలోమీటర్ల అలైన్‌మెంట్ చేసిన అధికారులు నా  వైపు మాత్రం 28 కిలోమీటర్లకే ఎందుకు పరిమితం చేశారని ప్రశ్నించారు. 

రైతు సం  నాయకులు కృష్ణారెడ్డి, రాములు గౌడ్ మాట్లాడుతూ.. త్వరలోనే భూనిర్వాసితులతో భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని వెల్లడించారు.  మాజీ జెడ్పిటిసి పెద్దింటి బుచ్చి రెడ్డి, భూ నిర్వాసితులు పాల్గొన్నారు.