calender_icon.png 12 January, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నౌజ్ రైల్వే స్టేషన్‌లో కుప్పకూలిన భవనం పైకప్పు

12-01-2025 12:37:55 AM

  • శిథిలాల కింద చిక్కుకున్న ౩5 మంది
  • 23 మందిని బయటకు తీసిన సహాయక సిబ్బంది

కన్నౌజ్, జనవరి 11: ఉత్తర ప్రదేశ్‌లోని కన్నౌజ్ రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు శనివారం మధ్యాహ్నం ఆకస్మాత్తుగా కూలిం ది. దీంతో శిథిలాల కింద దాదాపు ౩5 మంది  కార్మికులు చిక్కుకున్నారు. రైల్వే స్టేష న్ సుందరీకరణలో భాగంగా రెండంతస్తుల భవన నిర్మాణ పనులు చేస్తుండగా ఈ ఘట న జరిగింది. ప్రమాద సమయంలో 35 మంది కార్మికులు ఉన్నారు.

వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కాగా ప్రమాదంలో 23 మంది కార్మికులకు గాయాలయ్యాయి.  ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5లక్షలు, స్వల్పం గా గాయపడిన వారికి రూ.5ంవేల పరిహారాన్ని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఘటనపై సీఎం ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్య క్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనకు గల కారణాలను తేల్చేందుకు కేంద్ర రైల్వేమంత్రి  విచారణ కమిటీని ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు.