calender_icon.png 21 February, 2025 | 11:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ గెలుపులో యువత పాత్ర కీలకం

19-02-2025 08:11:01 PM

ఎమ్మెల్యే పాయం...

మణుగూరు (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపులో యువ నాయకుల పాత్ర కీలకమైందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు తరుణ్ రెడ్డి బుధవారం మణుగూరు ప్రజాభవన్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాయంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తరుణ్ రెడ్డిని ఎమ్మెల్యే పాయం అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పార్టీ గెలుపులో యువజన నాయకుల పాత్ర కీలకమని, రాబోవు స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి  వెళ్ళేలా యువజన నాయకులు కృషి చేయాలన్నారు. యువజన విభాగం తరపున విస్తృతంగా సేవా కార్యక్రమాలను చేపట్టాలని తరుణ్ రెడ్డికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేకంగా సూచించారు.