26-04-2025 01:21:44 AM
హై-టెక్ సిటీ కేర్ హాస్పిటల్స్ డాక్టర్ ప్రభా అగర్వాల్
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): క్యాన్సర్ నివారణలో వాక్సిన్ల పాత్ర కీలకమని హై-టెక్ సిటీలోని కేర్ హాస్పిటల్స్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సతీష్ పవార్ తెలిపారు. ఈ నెల 24 వరకు ప్రపంచ వ్యాక్సినేషన్ వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. కేవలం అనారోగ్యకరమైన అల వాట్లే కాకుండా అవగాహన లేకపోవడం, ఆలస్యంగా నిర్ధారణ కావడంతో క్యానర్సర్ రోగులు పెరుగుతున్నారని చెప్పారు. 2022లో భారత్‌లో 14.6 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదు అయ్యాయని, 2025 నాటికి ఈ సంఖ్య 15.7 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేశారు. మహిళలలో, సర్వికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తాయన్నారు.
కొన్ని రకాల క్యాన్సర్లను వ్యాక్సిన్ల ద్వారా నివారించవచ్చన్నారు. ఈ ఏడాది ప్రపంచ వ్యాక్సినే షన్ వారోత్సవం సందర్భంగా ‘హ్యూమన్లీ పాసిబుల్, ప్రొటెక్టింగ్ ఫ్యూచర్ జనరేషన్స్‘ అనే నినాదంతో నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఇది వ్యాక్సిన్లు ఎలా ప్రజలను తీవ్ర మైన వ్యాధుల నుంచి వాటిలో కొన్ని క్యాన్సర్ల నుంచి రక్షించగలవో తెలియజేస్తోందన్నా రు. కేర్ హాస్పిటల్స్, సర్వికల్, కాలే య క్యాన్సర్లను నివారించడానికి వ్యాక్సిన్ల ప్రాముఖ్యతను తెలియజేస్తోందన్నారు.
హెచ్‌ఐవీ, హెపటైటిస్ బీ వ్యాక్సిన్లు రాబోయే సంవత్సరాల్లో క్యాన్సర్‌ను తగ్గించేందుకు అవకాశంగా ఉంటాయన్నారు. ఈ వ్యాక్సి న్లు తగిన సమయానికి పిల్లలకు, యువతులకు ఇవ్వడం ఎంతో కీలకమైనది అని అన్నారు. హెచ్‌ఐవీ వ్యాక్సిన్ 26 సంవత్సరాల వయస్సు దాటిన యువతీ యువకులు కూడా ఈ వ్యాక్సిన్ ద్వారా లాభపడవచ్చన్నారు. హెపటైటిస్ బి వ్యాక్సిన్ సాధారణంగా జన్మ సమయంలో, చిన్న వయస్సులో ఇచ్చే వాక్సిన్. ఇది జీవితాంతం కాలేయ సంక్రమణల నుంచి రక్షణ కలిగించి, కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందన్నారు. అబ్బాయిలకు కూడా హెచ్‌ఐవీ వ్యాక్సిన్ ఇస్తే వారి ఆరోగ్యాన్ని రక్షించడమే కాదు, సమాజం మొత్తం రక్షణను బలోపేతం చేస్తుందన్నారు. కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు ఈ వ్యాక్సిన్లపై అవగాహన కల్పిస్తున్నట్టు డాక్టర్ అగర్వాల్ తెలిపారు.