calender_icon.png 25 November, 2024 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఉద్యమంలో మీడియా పాత్ర కీలకం

25-11-2024 01:23:28 AM

ఎమ్మెల్సీ కోదండరాం

ముషీరాబాద్, నవంబర్ 24: తెలంగాణ ఉద్యమ సమయంలో భావజాల వ్యాప్తికి మీడియా కీలకంగా వ్యవహరించిదని టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఉద్యమకారు డు కాచం సత్యనారాయణ గుప్తా సారథ్యంలో నిర్వహిస్తున్న వీభూ ఛానెల్ ఆరో వార్షికోత్సవానికి ఆయ న హాజరై మాట్లాడారు.

ప్రత్యేక రాష్ట్రం వస్తే సొంతంగా పాలించుకోగలరా అని ప్రశ్నించిన వారే నేడు మనల్ని  ఆదర్శంగా తీసుకుంటున్నారని అన్నా రు. శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మాట్లాడు తూ పత్రికలు, ఛానళ్లు ఏ రాజకీయ పక్షం కొమ్ముకాయకుండా ప్రజల పక్షాన నిలబడి వారి గొంతుకగా మారాలని కోరారు.

మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఒక ఛానల్‌ను నడపడం ఎంత కష్టమైన పనో తనకు తెలుసునని, తాను కూడా ఓ ఛానల్‌ను నడిపినట్లు గుర్తుచేసుకున్నా రు. అరుణోదయ విమలక్క మాట్లాడుతూ జర్నలిజమంటే వాస్తవమని, సోషల్ మీడియా ఎంత అభివృద్ధి చెం దినా పత్రికలను తప్పక చదవాలన్నా రు.

కాచం సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ ఆరేళ్లుగా ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి రాజకీయాలకు అతీ తంగా ప్రజల పక్షాన నిలబడినట్లు చెప్పారు. ఈ సందర్భంగా విశ్వంభర దిన ఛానెల్ లోగోను ఆవిష్కరించారు.