calender_icon.png 8 January, 2025 | 3:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

06-01-2025 12:00:00 AM

 ఎస్టీయూ డైరీ ఆవిష్కరణలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కరీంనగర్, జనవరి5 (విజయక్రాంతి): స్టేట్ టీచర్స్ యూనియన్ కరీంనగర్ 2025 నూతన సంవత్సర డైరీని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఎస్టీయూ సంఘం ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల సాధన లో అనేక దశాబ్దాలుగా ఎనలేని పోరాటం సాగిస్తున్నదని, స్వాతంత్రానికి ముందే ఏర్ప డి ఉపాధ్యాయులకు అనేక సౌకర్యాలు క ల్పించిన సంఘం ఎస్టీయూ అని వారు అన్నారు.

ఎస్టియు డైరీలో ఉపాధ్యాయ విద్య పరమైన అనేక అంశాలు సమగ్రంగా పొం దుపరిచారన్నారు విద్యాభివృద్ధిలో ఉపాధ్యా యులు కీలక పాత్ర పోషించాలని ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలని పేర్కొన్నారు  ఉపాధ్యాయ సమస్యల సాధనలో తన పూర్తి సహకారం అందిస్తానన్నారు.

ఈ కార్యక్ర మంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిఆర్ శ్రీనివాస్, కట్టా రవీంద్రా చారి రాష్ర్ట బాధ్యులు పిన్నింటి తిరుపతిరావు, సాన కిషన్, కందుకూరి దయానంద్, వెలిచాల వెంకటస్వామి సీనియర్ నాయకులు కరుణా కర్ రెడ్డి జిల్లా బాధ్యులు కోట శ్యామ్ కుమా ర్, కోట శ్యాం కుమార్ దాసరి సుభాష్, రజా క్ పాషా, గోలి సతీష్, మేరుగు అంజయ్య, బోళ్ల బత్తిని వెంకటరమణ, కందుకూరి శ్రీని వాస్, లక్ష్మణాచారి, తాడూరి మాధవస్వామి, లక్ష్మీరాజం బందెల్లి రాజు పాల్గొన్నారు.