calender_icon.png 12 February, 2025 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ ఎన్నికల్లో ఆర్వోల పాత్ర కీలకం

12-02-2025 12:00:00 AM

నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్లగొండ, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఆదిత్య భవన్లో పంచాయతీ ఎన్నికల స్టేజీ వన్, స్టేజ్ టు రిటర్నింగ్ అధికా రులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలోఆమె మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో సొంత నిర్ణయాలు తీసుకోవద్దని, ఈసీ నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించారు.

విధుల్లో పొరపాట్లు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నాటి నుంచే ఉద్యోగులందరూ ప్రవర్తనా నియమావళి పరిధిలో ఉంటారని గుర్తు చేశారు. నామినేషన్లు పరిశీలన, ఉపసంహరణ తదితర అన్ని అంశాల్లో పూర్తి జాగ్రత్తగా ఉండాని, సందేహాలుంటే ఎన్నికల అధికారుల ద్వారా నివృత్తి చేసుకోవాలని చెప్పారు.జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డీపీఓ వెంకయ్య, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజకుమార్, మాస్టర్ ట్రైనర్ బాలు, తదితరులు హాజరయ్యారు.