28-02-2025 07:53:16 PM
కేశవ్ స్మారక విద్యాసంతి సంయుక్త కార్యదర్శి శ్రీధర్ రెడ్డి..
ముషీరాబాద్ (విజయక్రాంతి): విద్యార్థుల క్రమశిక్షణ పెంపొందించడంలో వ్యాయామ విద్యా ఉపాధ్యాయుడు(పి.డీ) పాత్ర కీలకమని కేశవ్ స్మారక విద్యా సమితి సంయుక్త కార్యదర్శి శ్రీధర్ రెడ్డి తెలిపారు. హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ కె .సత్యనారాయణ రెడ్డి గురువారం జరిగిన పదవి విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్కూల్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన వ్యాయామ విద్యా ఉపాధ్యాయుడు కె .సత్యనారాయణ రెడ్డి 23 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకుని పదవి విరమణ పొందడం బాధాకరమైనప్పటికీ ఉద్యోగులకు ఇది సర్వసాధారణమైన విషయమని ఆయన చెప్పారు. సేవా భావంతో అంకితభావంతో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కేశవ్ స్మారక విద్యా సమితి కోశాధికారి ఎల్. ప్రభాకర్ రెడ్డి. జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ నాగ సునీత, కేశవ్ స్మారక హై స్కూల్ ప్రిన్సిపాల్ వాణి. తెలంగాణ జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బి లక్ష్మయ్య తెలంగాణ జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్స్ డాక్టర్ బి.లక్ష్మయ్య రాష్ట్ర డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎ. బాలరాజు ఆకాష్ జూనియర్ కాలేజ్ కలస్పాండెంట్ సి.పి. శ్రీనివాస్ రెడ్డి కేశవ స్మారక డిగ్రీ కాలేజ్ అకౌంట్స్ ఆఫీసర్ అశోక్ గౌడ్, ఫిజికల్ డైరెక్టర్ మధు సీనియర్ టీచర్లు ఎం.సత్యం. శోభ. ప్రకాష్ రైతులు పాల్గొన్నారు.