calender_icon.png 22 January, 2025 | 9:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మీడియా పాత్ర కీలకం..

22-01-2025 05:55:27 PM

మేడిపల్లి ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ 2025 డైరీ ఆవిష్కరించిన మంత్రి సీతక్క...

మేడిపల్లి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే మీడియా ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా తమ విలువైన సూచనలు అందజేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని మహిళా & శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Sithakka) అన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ దేవి కన్వెన్షన్ లోని మేడిపల్లి ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్(Medipally Print Media Press Club) 2025 డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి మహిళా & శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్మెన్ మల్లిపెద్ది శరత్ చంద్ర రెడ్డి, బోడుప్పల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అమర్ సింగ్, బోడుప్పల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.