03-04-2025 12:00:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): విద్యుత్ సంస్థలలో క్షేత్ర స్థాయిలో పనిచేసే లైన్ మెన్, ఆర్టిజన్‌ల పాత్ర ఎంతో కీలకమని, పైస్థాయిలో ప్రభుత్వం, విద్యుత్ యా జ మాన్యాలు ఏ నిర్ణయాలు తీసుకున్నా, కింది స్థాయిలో పనిచేసే సిబ్బంది వ్యవహార శైలి, పని విధానం మీదనే సంస్థ ప్రగతి, ప్రతిష్టలు ఆధారపడి ఉన్నాయని ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు.
వేసవి కాలంలో పెరుగు తున్న డిమాండ్ కు తగ్గట్టు, గ్రేటర్ హైదరాబాద్ నగరంలో నాణ్యమైన సరఫరా అం దించడానికి గాను గత మూడు నెలలుగా నూతన పవర్ ట్రాన్స్ ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్‌ల ఏర్పాటు, అదనపు ఫీడర్ల ఏర్పాటు వంటి అదనపు పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు.
లైన్ మెన్, ఆర్టిజన్‌లను కూడా సంసిద్ధం చేయడం కోసం అన్ని సర్కిళ్లలో క్షేత్ర స్థాయి సిబ్బందితో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా జెన్‌కో ఆడిటోరియంలో బంజారాహిల్స్ సర్కిల్ పరిధి లోని మొత్తం సిబ్బందితో బుధవారం సమీ క్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సుల్తానియా మాట్లాడుతూ..ఈ యా సంగి పంటల సీజన్‌లో విద్యుత్ డిమాండ్ 17,162 మెగా వాట్లకు చేరిందన్నారు. డిమాండ్ ఇంతగా పెరిగినా ఎలాంటి సమస్యలు లేకుండా సరఫరా అందిచడం వెనుక విద్యుత్ సంస్థల్లో పని చేసే సిబ్బంది అధికారుల కృషి వలననే ఇది సాధ్యమైందన్నారు.
వేసవి కాల ప్రభావంతో అర్బన్ సర్కిళ్లలో డిమాండ్ క్రమక్రమంగా పెరుగుతున్నదన్నారు. గత వేసవితో పోల్చుకుంటే, ఈ ఏప్రి ల్, మే నెలల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యు త్ డిమాండ్ భారీ స్థాయిలో పెరిగే అవకాశాలున్నాయన్నారు.
గతేడాది గ్రేటర్ హైద రాబాద్‌లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 4352 మెగా వాట్లుగా నమోదయ్యిది, అయితే ఈ ఏడాది 5000 మెగా వాట్లకు మించి నమోదయ్యే అవకాశమున్నదని తెలిపారు. క్షేత్ర స్థాయి సిబ్బంది అప్రమత్తంగా వుంటూ, ప్రతి వినియోగదారుడితో మంచి సంబంధాలను కొనసాగించాలని సూచించారు.