calender_icon.png 20 April, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయసేవల విస్తృతిలో న్యాయవాదుల పాత్ర అమోఘం

19-04-2025 11:35:12 PM

నిజామాబాద్ (విజయక్రాంతి): జిల్లా న్యాయసేవాధికార సంస్థ నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో* న్యాయావాదులు పోషించిన,సహకరించిన పాత్ర అమోఘమని సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని సమావేశపు హల్ లో బార్ అధ్యక్షుడు మామిల్ల సాయరెడ్డి అధ్యక్షత ఏర్పాటు చేసిన వీడ్కోలు సమేవేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యోగరీత్యా బదిలీపై వచ్చానని,బదిలీపై వెళుతున్నానని వృత్తిరీత్యా పదవికి న్యాయం చేశామా లేదా ఆనేదే ప్రధానమని ఆమె తెలిపారు. న్యాయసేవ సంస్థ తరపున న్యాయసేవలు కక్షిదారులకు అందించడంలో అగ్రభాగాన నిలిచామని ఆమె పేర్కొన్నారు.

బార్ ప్రధాన కార్యదర్శి మానిక్ రాజు మాట్లాడుతూ... న్యాయవాదుల ప్రయోజనాలు ప్రణంగాపెట్టి లోక్ అదాలత్ లను విజయవంతం చేయడంలో క్రీయాశీలక భూమిక పోషించామని తెలిపారు. బదిలీపై వెళుతున్న జడ్జి పద్మావతి కి  అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి లు శాలువా,మెమోంటోతో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు సాయరెడ్డి ప్రసంగిస్తూ జడ్జిలు బదిలీపై ఉద్యోగరీత్యా వచ్చినప్పుడు ,బదిలీపై వెళుతున్నప్పడు బార్ గౌరవనీయంగానే చూసుకుని వీడ్కోలు చెప్పే సంప్రదాయంలో పొరపాటుకు తావు ఇవ్వలేదని తెలిపారు. కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు దిలీల్,సంయుక్త కార్యదర్శి ఝాన్సీరాణి, కోశాధికారి నారాయణ దాసు, లైబ్రరీ కార్యదర్శి శ్రీమాన్, న్యాయవాదులు పాల్గొన్నారు.