calender_icon.png 9 April, 2025 | 10:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాషోపాధ్యాయుల పాత్ర కీలకమైనది

04-04-2025 12:00:00 AM

జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ 

మహబూబ్ నగర్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): మాతృభాష అమ్మ లాంటిదని ఇతర భాషలు నేర్చుకోవాలంటే మాతృభాషలో పట్టు ఉన్నప్పుడే సాధ్యమవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు గురువారం జిల్లా కేంద్రంలోని విద్యా శిక్షణ సంస్థలో పదోన్నతి పొందిన తెలుగు భాషోపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో డీఈవో మాట్లాడారు.

పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు తమ నైపుణ్యాలని పెంచుకొని పాఠ్యాంశాలను బోధించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ పాఠ్యాంశాలను బోధిస్తున్నారని మరో అడుగు ముందుకేసి ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన చేసేందుకు శ్రీకారం చుట్టిందన్నారు.

రాబోయే రోజులన్నీ ఏఐ  ప్రభావం చూపి అవకాశం ఉందని పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమం ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగపడుతుందని డీఈఓ అన్నారు.   

ఈ కార్యక్రమంలో ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, డైట్ కళాశాల ప్రిన్సిపల్ మీరాజుల్లా ఖాన్  జిల్లా రిసోర్స్ పర్సన్ లు గుమ్ముడాల చక్రవర్తి గౌడ్ గిరిజారమణ మల్లేశ్వర్ జి వెంకటేశ్వర్లు కమలేకర్ శ్యాం ప్రసాద్ ఇరివింటి వెంకటేశ్వర శర్మ అంబటి భానుప్రకాష్ బలరాంగౌడ్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.